న్యూఢిల్లీ : క్యాడ్బరీస్ బోర్న్‌విటా (Bournvita) చాక్లెట్ హెల్త్ డ్రింక్‌లో హై షుగర్ కంటెంట్ ఉందనే అంశాన్ని ఇన్ఫ్లుయెన్సర్ లేవెనెత్తిన 8 నెలల అనంతరం 14.4 శాతం యాడెడ్ షుగర్ క్వాంటిటీ తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. 100 గ్రాముల పౌడర్‌లో గతంలో 37.4 శాతం షుగర్ కంటెంట్ ఉండగా న్యూ ప్యాకేజ్‌లో 100 గ్రాములకు 22.2 శాతం షుగర్ ఉన్నట్టు బోర్న్‌విటా వెల్లడించింది.
హెల్త్ ఇన్ఫ్లుయన్సర్, సోషల్ మీడియా కార్యకర్త రేవంత్ హిమత్సింగ్కా బోర్న్‌విటాలో హై షుగర్ కంటెంట్ ఉందని హైలైట్ చేయడంతో కంపెనీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగివచ్చిన బోర్న్‌విటా షుగర్ కంటెంట్‌ను తగ్గించడంతో ఇది తమకు దక్కిన భారీ విజయమని హిమత్సింగ్కా ఇన్స్టాగ్రాం రీల్లో పేర్కొన్నారు.
ఇన్స్టాగ్రాం రీల్‌తో ఆహార దిగ్గజం తన షుగర్ కంటెంట్‌ను తగ్గించడం చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు బిగ్ విన్ అంటూ పేర్కొన్నారు. ఒక్క వీడియోతో 15 శాతం షుగర్ తగ్గిస్తే భారతీయులందరూ ఫుడ్ లేబుల్స్ చదవడం ప్రారంభిస్తే కంపెనీలు సైతం తప్పుడు మార్కెటింగ్ ప్రచారాలకు తెగబడటానికి భయపడతాయని వీడియోను షేర్ చేస్తూ ఆయన రాసుకొచ్చారు.
Read More :