Swami Sivananda Baba | మహా కుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళాలో 129 ఏళ్ల స్వామి శివానంద బాబా పాల్గొన్నారు. ఆయన గత వందేళ్ల నుంచి ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్‌లలో జరిగిన అన్ని కుంభ మేళాలకు హాజరయ్యారని ఆయన శిష్యులు తెలిపారు. ఆయన క్రమం తప్పకుండా యోగా చేస్తారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. స్వామి శివానంద నిత్యం తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర నుంచి లేచి, యోగా చేస్తారు. రాత్రి 9 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తారు. ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. రోజూ కనీసం ఓ అరగంట సమయాన్ని యోగాకు కేటాయించాలని ఆయన యువతకు సలహా ఇచ్చారు.