ముంబై, అక్టోబర్ 21: వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని దత్తత తీసుకొని, ఇంట్లో తిండిపెట్టి పోషించుకోవాలని జంతు ప్రేమికులనుద్దేశించి బాం బే హైకోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కలకు ఎక్కడపడితే అక్కడ తిండిపెడుతున్నారని, దీంతో అవి ఆయా ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయని తెలిపింది. ఆ ప్రాంతాల నుంచి వెళ్లే వారికి ఆ కుక్కలతో ప్రమా దం పొంచి ఉంటున్నదని వెల్లడించింది. కాబట్టి ఇలాంటి శునకాలను దత్తత తీసుకొని లేదా జంతుశాలలకు తరలించి తిండిపెడితే బాగుంటుందని పేర్కొ ంది. వీధి కుక్కలను నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పుడు ఎవరైనా అడ్డుపడితే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.