న్యూఢ్లిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. మంగళవారం 100కు పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాలు, హోటళ్లకు బెదిరింపు ఈ-మెయిళ్లు పంపిన 35 ఏండ్ల వ్యక్తిని నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
టెర్రరిజంపై పుస్తకం రాయడమే కాక, 2021లో ఒక కేసులో అరెస్టయిన జగదీశ్ ఈ నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.