Bomb threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb threat) సర్వసాధారణమైపోయాయి. పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, నేతలకు ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ (Gurugram) నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
నగరంలోని ఆంబియెన్స్ మాల్ (Ambience mall)కు శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు మాల్ మేనేజ్మెంట్కు మెయిల్ ద్వారా బెదిరించారు. ‘ప్రతి ఒక్కరినీ చంపేందుకు మాల్లో బాంబులు అమర్చాం. మీలో ఎవ్వరూ తప్పించుకోలేరు (None of you will escape). అందరూ చస్తారు’ అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన మాల్ అధికారులు వెంటనే పోలీసులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని మాల్‌ను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read..
Lucknow airport | కార్గో ప్రాంతంలో రేడియోధార్మిక పదార్థం.. లక్నో ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
Cloudburst | హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన రోడ్లు
Bridge Collapse | బీహార్‌లో మరోసారి కూలిన గంగానదిపై నిర్మిస్తున్న తీగల వంతెన.. ఇప్పటికి ఇది మూడోసారి