Gurugram | గుర్గావ్ మున్సిపల్ మేయర్ ఆఫీసుకు బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ తనిఖీ
Gurugram : హరియాణాలోని గురుగ్రామ్ (గుర్గావ్) మున్సిపల్ ఆఫీసుకు, మేయర్ ఆఫీసుకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
Gurugram : హరియాణాలోని గురుగ్రామ్ (గుర్గావ్) మున్సిపల్ ఆఫీసుకు, మేయర్ ఆఫీసుకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ మున్సిపల్ కార్యాలయానికి గురువారం ఒక మెయిల్ వచ్చింది. ప్రో ఖలిస్తాన్ గ్రూప్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
మెయిల్ ప్రకారం.. గురుగ్రామ్ మున్సిపల్ కార్యాలయంతోపాటు, మేయర్ ఆఫీసులోనూ బాంబులు పెట్టారు. హరియాణాను ఖలిస్తాన్‌గా మారుస్తామని, దర్బార్ సాహిబ్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఈ మెయిల్‌పై మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సెక్టార్ 34లో ఉన్న మున్సిపల్ ఆఫీసుకు, మేయర్ ఆఫీసుకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఉన్న సిబ్బంది, నేతలు, సందర్శకులను అక్కడినుంచి బయటకు పంపించారు. బాంబ్ స్క్వాడ్ కూడా సోదాల్లో పాల్గొంటున్నారు. రెండు ఆఫీసుల్లో, మొత్తం ప్రాంగణంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఎలాంటి బాంబ్‌ను అధికారులు గుర్తించలేదు. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో గోల్డెన్ టెంపుల్ నుంచి దుండగుల్ని బయటకు పంపించారు. ఈ సందర్బంగా జరిగిన ఘర్షణల గురించి కూడా తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వార్షికోత్సవానికి రెండు రోజులు ముందు హరియాణాలోని గురుగ్రామ్ మున్సిపల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం సంచలనం కలిగించింది. మరోవైపు సిక్కుల్లో ఒక వర్గం తమను ప్రత్యేకంగా విభజించి, ఖలిస్తాన్ అనే దేశాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశాల్లోని కొన్ని అసాంఘిక శక్తులు ఈ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

