తిరువనంతపురం : కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్ జిల్లా పయ్యన్నూర్‌లోని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం దాడి చేయగా భవనం కిటికిలు దెబ్బతిన్నాయి. అయితే, ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అయితే, సీపీఐ (ఎం) కార్యకర్తలో దాడికి పాల్పడ్డారని ఆర్ఎస్ఎస్ ఆరోపించింది. గత నెల 30న రాత్రి ఏకేజీ సెంటర్ వద్ద సీపీఐ (ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయం బాంబు దాడి జరిగింది. రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ తర్వాత దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు నిందితుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. ఇంతకు ముందు వయనాడ్‌లోని కాంగ్రెస్ నేత రాహుల్ కార్యాలయంపై దాడి ఘటన చోటు చేసుకున్నది.
Kerala | Visuals from RSS office in Payyannur, Kannur which was allegedly bombed early this morning, leaving the window glass broken pic.twitter.com/ALjpuXNH2K
— ANI (@ANI) July 12, 2022