రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం బీజాపూర్‌కు సమీపంలోని కోడేపాల్ వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతరను పేల్చడంతో.. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన 170 సీఆర్పీఎఫ్ బెటాలియన్.. ఆ ఏరియాలో కూంబింగ్ చేపట్టింది. గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.