ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు వచ్చాయి. ‘సల్మాన్ నిన్ను ఇంట్లోనే చంపుతాం లేదా నీ కారును బాంబుతో పేల్చేస్తాం’ అంటూ సోమవారం ముంబైలోని వర్లి రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.