న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. దీంతో డ్రీమ్‌లైనర్ విమానంపై మరోసారి చర్చ మొదలైంది. బోయింగ్ 787-8డ్రీమ్ లైనర్ అనేది అత్యాధునిక, సుదూర, వైట్‌బాడీ మోడల్ విమానం. సామర్థ్యం, సౌకర్యం, పర్యావరణ హితంగా దీనిని రూపొందించారు.
బోయింగ్ డ్రీమ్ లైనర్ సిరీస్‌లో మొదటి మోడల్ 2011లో అందుబాటులోకి వచ్చింది. ఖండాంతర ప్రయాణాల కోసం దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎయిర్‌లైన్ కాన్ఫిగరేషన్‌ను బట్టి డ్రీమ్‌లైనర్‌లో 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించవచ్చు. నాన్‌స్టాప్‌గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలిగే సామర్థ్యం దీని సొంతం. కాబట్టి ప్రధాన నగరాల మధ్య నాన్‌స్టాప్ ప్రయాణాలకు డ్రీమ్‌లైనర్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. విమాన ప్రాథమిక నిర్మాణంలో 50 శాతానికిపైగా కార్బన్ ఫైబర్ మిశ్రమాలను ఉపయోగించారు. ఫలితంగా విమానం తేలికగా ఉండి ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుంటుంది. తాజా ఏవియానిక్స్, ఫ్లైబై వైర్ కంట్రోల్స్, అత్యాధునిక భద్రతా వ్యవస్థలను ఇందులో ఉపయోగించారు. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్‌లో అత్యాధునిక నేవిగేషన్, భద్రతా వ్యవస్థలు ఉండటంతో పరిస్థితులపై అవగాహన, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పటిష్ఠమైన బాడీతో అత్యధికంగా అమ్ముడవుతూ 14 ఏండ్ల నుంచి వాడుకలో ఉన్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌కు ఇంత భారీ స్థాయిలో ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం 11.5 సంవత్సరాల క్రితంది. ఇప్పటివరకు 41 వేల గంటలకు పైగా ప్రయాణించిందని విమానయాన అధికారులు తెలిపారు. గురువారం కూలిపోయిన బోయింగ్ 787-8 ఎయిరిండియా నడుపుతున్న లెగసీ విమానాలలో ఒకటి. ప్రస్తుతం మన దేశంలో ఎయిరిండియా, ఇండిగో వైమానిక సంస్థలు మాత్రమే బీ787 విమానాలను నడుపుతున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా అలహాబాద్ ప్రమాదంలో బోయింగ్ 787 పూర్తి స్థాయిలో ధ్వంసమైందని ఒక అధికారి చెప్పారు.
డ్రీమ్ లైనర్ విమానాల్లోని నాణ్యతా సమస్యలను పరిష్కరించకుంటే వందలమంది చనిపోయే ప్రమాదం ఉన్నదని ఏడాది క్రితమే యూఎస్ కాంగ్రెస్‌ను విజిల్ బ్లోయర్ ఒకరు హెచ్చరించారు. బోయింగ్ ఇంజినీర్, విజిల్‌బ్లోయర్ అయిన శామ్ సలేపూర్ గతంలో పలు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని, దీనివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి ఈ విమానాల తయారీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను బోయింగ్ కొట్టిపారేసింది. దశాబ్దానికిపైగా బోయింగ్‌లో పనిచేసిన సలేపూర్.. 787 డ్రీమ్‌లైనర్‌లోని కీలక విభాగాల మధ్య ఒక సమస్యను గుర్తించానని, ఇది సర్వీసులో ఉన్న వెయ్యికిపైగా జెట్లను ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు.
చరిత్రలో ఇప్పటివరకూ జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేషిస్తే, ఎక్కువ ప్రమాదాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలోనే జరిగినట్టు నిపుణులు చెప్తున్నారు. గత ఏడాది చిన్నవి పెద్దవి కలిపి మొత్తంగా 1,468 విమాన ప్రమాదాలు జరిగితే అందులో 770 ప్రమాదాలు ల్యాండింగ్ సమయంలో, 124 ప్రమాదాలు టేకాఫ్ సమయంలో జరిగినట్టు గుర్తు చేస్తున్నారు. టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయాల్లో భూమికి దగ్గరగా ప్లేన్ ఉంటుంది.
ఇంజిన్‌లో సమస్య, టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా తలెత్తితే వాటిని అంచనా వేసి, సరిచేయడానికి ఫైలట్‌కు ఇప్పుడు తగిన సమయం ఉండదు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే, టేకాఫ్-ల్యాండింగ్ సమయాల్లో విమాన వేగంలో మార్పులు, వాతావరణ పరిస్థితులు, రన్‌వేను సరిగ్గా అంచనా వేయడం వంటివి ఎంతో ముఖ్యం. ఇందులో ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రమాదానికి దానితీయొచ్చని నిపుణులు చెప్తున్నారు. టేకాఫ్ సమయాల్లో ఇంజిన్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కూడా గుర్తు చేస్తున్నారు. విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయాల్లో పక్షులను ఢీకొనే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుందని, దీంతో ప్రమాదాల సంభావ్యత కూడాపెరుగుతున్నట్టు చెప్తున్నారు.\
ఎక్కడ: స్పెయిన్,
ఎప్పుడు: 1977
ఎలా: రన్‌వే పై రెండు
విమానాలు ఢీ
మృతులు583
ఎక్కడ: జపాన్,
ఎప్పుడు: 1985
ఎలా: సాంకేతిక సమస్యతో కూలింది
మృతులు 520
ఎక్కడ: ఢిల్లీ,
ఎప్పుడు: 1996
ఎలా: గాలిలో రెండు విమానాలు ఢీ
మృతులు 349
ఎక్కడ: ఫ్రాన్స్,
ఎప్పుడు: 1974
ఎలా: తలుపు తెరుచుకోవడంతో పేలుడు
మృతులు 346
ఎక్కడ: ఐర్లాండ్- అట్లాంటిక్ ఓషన్,
ఎప్పుడు: 1985
ఎలా: ఖలిస్థాన్ ఉగ్రవాదుల బాంబుదాడి
మృతులు 329
అహ్మాదాబాద్ విమాన ప్రమాదంలో పైలట్లు ఎవరు?
వాళ్ల అనుభవమేంటీ?
ఎక్కడ: ఉక్రెయిన్,
ఎప్పుడు: 2014
ఎలా: క్షిపణి ఢీకొట్టడంతో..
మృతులు298
ఎక్కడ: సౌదీ అరేబియా,
ఎప్పుడు: 1980
ఎలా: విమానంలో మంటలు
మృతులు 301
ఎక్కడ: ఇరాన్, ఎప్పుడు: 2003
ఎలా: బలమైన గాలుల వల్ల
మృతులు 275
ఎక్కడ: ఇరాన్,
ఎప్పుడు: 1988
ఎలా: అమెరికా క్షిపణి దాడివల్ల
మృతులు 290
ఎక్కడ: అమెరికా,
ఎప్పుడు: 1979
ఎలా: ఇంజిన్‌లో తలెత్తిన లోపం
మృతులు 273
ప్రధాన పైలట్: సుమిత్ సభర్వాల్ (8200 ఫ్లైయింగ్ అవర్స్)
కోపైలట్: ైక్లెవ్ కుందర్ (1100 ఫ్లైయింగ్ అవర్స్)