బెగుసరాయ్, జూలై 30: బీహార్‌లోని బెగుసరాయ్‌లో పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. ఓ మృతదేహం కాలుకు తాడును కట్టి లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జంతువు కళేబరం మాదిరిగా మనిషి మృతదేహాన్ని అలా లాక్కెళ్లడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను పురమాయించి ఇలా అమానవీయంగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ట్రాక్టర్లో పడేసి స్థానిక దవాఖానకు మృతదేహాన్ని తీసుకెళ్లారు.