Kerala | తిరువనంతపురం: కేరళలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు మళప్పురం జిల్లాలోని తన్నూర్ సమీపంలో పురపుజా నదిలో ఓ డబుల్ డెక్కర్ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు.
మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 30 – 40 మంది ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తున్నది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక మత్య్సకారులు రెస్క్యూ చర్యలు చేపట్టారు.