న్యూఢిలీ : కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో డిప్యూటీ సెక్రటరీ నవ్‌జోత్ సింగ్ (52), ఆయన భార్య సందీప్ ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై వెళ్తుండగా, వారిని బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. సింగ్ మరణించగా, సందీప్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్‌కు లేదా ఆర్మీ బేస్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని ఆమె గగన్‌ప్రీత్‌ను, ఆమె భర్తను పదే పదే కోరారు.
కానీ వారు సింగ్, సందీప్‌లను 19 కి.మీ దూరంలోని చిన్న దవాఖానకు తీసుకెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బీఎండబ్ల్యూ కారు నడిపిన గగన్ప్రీత్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.