Watch: ప్రయాణికురాలిని దారుణంగా కొట్టిన బస్సు కండక్టర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Conductor Assaults Lady Passenger | ఒక ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ దారుణంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ కండక్టర్ను సస్పెండ్ చేశారు. అలాగే మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఒక ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ దారుణంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ కండక్టర్ను సస్పెండ్ చేశారు. అలాగే మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Conductor Assaults Lady Passenger) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 26న బిలేకహళ్లి నుంచి శివాజీనగర్కు వెళ్తున్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులోకి 24 ఏళ్ల తంజులా ఎక్కింది. తనకు ఉచిత ప్రయాణ టిక్కెట్ ఇవ్వాలని కండక్టర్ హొన్నప్ప నాగప్ప అగసర్ను ఆమె అడిగింది.
కాగా, ఆధార్ కార్డు చూపించాలని కండక్టర్ అడిగాడు. ఆ మహిళ చూపించకపోవడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రం కావడంతో కండక్టర్పై ఆమె చేయి చేసుకుంది. దీంతో ఆగ్రహించిన కండక్టర్ ఆ మహిళ చెంపపై పలుమార్లు కొట్టాడు. దీంతో అదుపుతప్పిన ఆమె కిందపడిపోయింది.
మరోవైపు ఆ బస్సులోని ఒకరు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కండక్టర్ హొన్నప్పను సస్పెండ్ చేశారు. అలాగే ఆ మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A Bengaluru Metropolitan Transport Corporation(BMTC) bus conductor, Honnappa Nagappa Agasar, was suspended and arrested after an altercation with a 24-year-old lady passenger, Tanzula Ismail Peerzade.
The incident occurred during a routine journey from Bilekahalli to… pic.twitter.com/dk9vhpdWO7
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

