శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఒకరికొకరు విమర్శించుకున్నారు. (Omar Abdullah Vs Mehbooba Mufti) పాకిస్థాన్‌తో జలాల ఒప్పందం గురించి వారిద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని వులార్ సరస్సు పునరుద్ధరణకు 1987లో తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌ను నాటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే సింధు జలాల ఒప్పదం ఉల్లంఘనగా పేర్కొంటూ పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో 2007లో ఈ ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆగిపోయిన తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌ను మనం తిరిగి ప్రారంభించగలమా? అని సీఎం ఒమర్ అబ్దుల్లా శుక్రవారం ట్వీట్ చేశారు. జీలం నావిగేషన్‌తో పాటు విద్యుత్ ఉత్పత్తిని కూడా ఈ ప్రాజెక్ట్ పెంచుతుందని అందులో పేర్కొన్నారు.
మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలను అవలంబిస్తున్నదని మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. దీనికి స్పందించిన ఒమర్ అబ్దుల్లా.. చౌకబారు ప్రచారం కోసం, సరిహద్దు అవతల ఉన్న కొందరిని సంతోషపెట్టేందుకు ముఫ్తీ చేస్తున్న గుడ్డి కోరిక ప్రయత్నమని ఆరోపించారు. అయితే ఎవరి ప్రసన్నం కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారో అన్నది కాలం చెబుతుందంటూ ముఫ్తీ కౌంటర్ ట్వీట్ చేశారు.
J&K Chief Minister Omar Abdullah’s call to revive the Tulbul Navigation Project amid ongoing tensions between India & Pakistan is deeply unfortunate. At a time when both countries have just stepped back from the brink of a full-fledged war—with Jammu and Kashmir bearing the brunt… https://t.co/LZrVAhIukQ
— Mehbooba Mufti (@MehboobaMufti) May 16, 2025
Actually what is unfortunate is that with your blind lust to try to score cheap publicity points & please some people sitting across the border, you refuse to acknowledge that the IWT has been one of the biggest historic betrayals of the interests of the people of J&K. I have… https://t.co/j55YwE2r39
— Omar Abdullah (@OmarAbdullah) May 16, 2025
Time will reveal who seeks to appease whom. However, it’s worth recalling that your esteemed grandfather Sheikh Sahab once advocated for accession to Pakistan for over two decades after losing power. But post being reinstated as Chief Minister he suddenly reversed his stance by… https://t.co/2jSBku731K
— Mehbooba Mufti (@MehboobaMufti) May 16, 2025