Juice Bar Cycle | టైటిల్ చదవగానే ఒక్కసారిగా మీ మదిలో సైకిల్ మెరిసింది కదా. కానీ.. సైకిల్‌తో పండ్ల జ్యూస్ ఎలా తయారు చేస్తారు అనే కదా మీ డౌట్. దానికి సమాధానం మాదగ్గర ఉంది. అదే జూగాడ్ అంటే. సరికొత్తగా ఆలోచిస్తూ నేటి యువత ఎక్కడికో వెళ్లిపోతోంది.
సోషల్ మీడియా పుణ్యమాని వాళ్ల టాలెంట్ ప్రపంచానికి తెలుస్తోంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ ఉంటాడు. అతడి సైకిల్ ముందు ఒక డబ్బాలా ఉంటుంది. ఆ డబ్బాలో జ్యూస్ చేసే జార్‌ను అమర్చాడు. దాన్ని సైకిల్ టైర్‌కు ఫిక్స్ చేశాడు. సైకిల్ టైర్ తిరుగుతున్నంత సేపు జ్యూస్ జార్లోని బ్లేడ్స్ తిరుగుతాయి. దాని ద్వారా లోపల ఉన్న పండ్లు మెత్తగా అయి జ్యూస్ తయారవుతుంది.
ఈ వెరైటీ సైకిల్‌ను గ్రీనోబర్ అనే సంస్థ తయారు చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ జీరో వేస్టేజ్‌తో పర్యావరణహితంగా ఉండేలా వస్తువులను తయారు చేస్తుంటుంది. అందులో ఒకటే ఈ గ్రైండర్ సైకిల్. అహ్మదాబాద్‌లో ఈ సంస్థ ఏర్పాటు చేసిన ఈ సైకిళ్ల మీద ఎక్కి కస్టమర్లు జ్యూస్ తయారు చేస్తున్నారు. ఈ కొత్త సైకిల్ ఎక్కి తమ ముచ్చట తీర్చుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ ఫోటోలో ఎన్ని గుర్రాలు ఉన్నాయో చెబితే మీరు గ్రేట్
ఇదిగో రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో