Spider Man | ఇదిగో రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో!
Spider Man | మనకు తెలియని ఎన్నో అందాలు అడవుల్లో ఉంటాయి. ఇలాంటివి ఫారెస్ట్ అధికారుల కళ్లకు కనబడుతుంటాయి. ఇటీవలి కాలంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు తమకు

మనకు తెలియని ఎన్నో అందాలు అడవుల్లో ఉంటాయి. ఇలాంటివి ఫారెస్ట్ అధికారుల కళ్లకు కనబడుతుంటాయి. ఇటీవలి కాలంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు తమకు కనిపించిన వింతలు విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రకృతి అందాలను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేసిన ఫొటో కూడా అలాంటిదే.
ఎరుపు, నీలం రంగుల్లో ఉన్న ఊసరవెల్లి ఫొటోను ఆయన షేర్ చేశారు. దీనిపేరు మ్వాంజా ఫ్లాట్-హెడెడ్ రాక్ అగమా అట. ‘దీన్ని కొందరు స్పైడర్ మ్యాన్ అగమా అని కూడా పిలుస్తారు. సినిమాల్లో స్పైడర్ మ్యాన్ చేసినట్లే ఇది కూడా నిలువుగా ఉండే గోడలపై పాకుతుంటుందని తెలుసా?‘ అని సుశాంత నంద వివరించారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘ఎట్టకేలకు స్పైడర్ మ్యాన్ సూట్ డిజైనర్ దొరికాడు‘ అని కొందరు ట్వీట్ చేస్తే.. స్పైడర్ మ్యాన్‌తో ఒక బల్లి లవ్‌లో పడితే ఇలాగే ఉంటుందంటూ మరికొందరు జోకులేస్తున్నారు. ఏదిఏమైనా ఈ ట్వీట్ అలాగే ఈ స్పైడర్ అగమా ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్‌గా మారిన మాట మాత్రం వాస్తవం.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

