How Many Horses You Can See | పజిల్స్ తెలుసు కదా మీకు. పజిల్స్‌ను సాల్వ్ చేయాలంటే మెదడుకు పదును పెట్టాలి. లేకపోతే పజిల్స్‌ను సాల్వ్ చేయడం అంత ఈజీగా అయ్యే పని కాదు. అలాగే కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్స్ ఉంటాయి. అవి చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఎంత ఆలోచించినా కూడా ఒక్కోసారి వాటి విషయంలో పప్పులో కాలేయాల్సి వస్తుంది.
ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటో కూడా అటువంటిదే. ఆ ఫోటోను ఒకసారి చూడండి. అందులో గుర్రాలు కనిపిస్తున్నాయి కదా. అక్కడ ఎన్ని గుర్రాలు ఉన్నాయో ముందే లెక్కపెట్టేయకండి. కాస్త ఆగండి.. అది నిజానికి ఫోటో కాదు. పెయింటింగ్. దట్టంగా మంచు కురుస్తుండగా.. పక్కనే గుట్టలు అవే రంగులో గుర్రాలు ఉండటం వల్ల ఆ పెయింటింగ్‌లో ఎన్ని గుర్రాలు ఉన్నాయో చెప్పడం కాస్త కష్టమే. అయినా కూడా కొంచెం బుర్రకు పదును పెట్టండి. అక్కడ ఎన్ని గుర్రాలు ఉన్నాయో ఇట్టే చెప్పేయొచ్చు.
మీరే కాదు.. ఆ ఫోటోను చూడగానే అందరూ చెప్పే సమాధానం 5. కానీ.. ఆ సమాధానం తప్పు. ఎందుకంటే అక్కడ 7 గుర్రాలు ఉన్నాయి. ఐదు గుర్రాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తాయి కానీ.. మిగితా రెండు గుర్రాల్లో ఒక గుర్రం తల మాత్రమే కనిపిస్తుంది. మరో గుర్రం బాడీ మాత్రమే కనిపిస్తుంది. సో.. 5, 2 మొత్తం కలిపితే 7 గుర్రాలు అన్నమాట. ఈ ఫోటోను చూడగానే అక్కడ 7 గుర్రాలు ఉన్నాయని చెప్పారంటే.. మీరు పజిల్ ఎక్స్పర్ట్ అన్నట్టే. మరి మీరు పజిల్ ఎక్స్‌పర్టా? కాదా.. మీరే తేల్చుకోండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇదిగో రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో
మత్స్యకారుడి వలలో భారీ సొరచేప.. ఎంత భారీ చేప అంటే?