Whale Shark: మత్స్యకారుడి వలలో భారీ సొరచేప.. ఎంత భారీ చేప అంటే..!
Whale Shark: తాజాగా బంగాళాఖాతంలో ఓ మత్స్యకారుడి వలకు చేప చిక్కింది. కానీ, అది చిన్నసన్న చేపకాదు.. సొరచేప. సొర అంటే సాధారణ సొర కాదు.

విశాఖపట్నం: సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు నిత్యం చేపల వేటకు సముద్రాల్లోకి వెళ్తుంటారు. అయితే, వాళ్ల వలల్లో చేపలేగాక అప్పుడప్పుడు గోండ్రుగప్పలు, పాములు, మొసళ్లు లాంటి ఇతర జీవులు కూడా చిక్కుతుంటాయి. చేపల వలల్లో ఇతర జీవులు చిక్కడం సర్వసాధారణమే. మత్స్యకారులందరూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం పొందినవారే. తాజాగా బంగాళాఖాతంలో ఓ మత్స్యకారుడి వలకు మాత్రం చేపనే చిక్కింది. కానీ, అది చిన్నసన్న చేపకాదు.. సొరచేప. సొర అంటే సాధారణ సొర కాదు. అత్యంత భారీ కాయంతో ఉండే వేల్ షార్క్.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరం నుంచి బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు తంటాడి బీచ్ సమీపంలో ఈ భారీ మత్స్యరాజం చిక్కింది. దాంతో మత్స్యకారులు వెంటనే అటవీ అధకారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు వల నుంచి ఆ వేల్ షార్క్‌ను విడదీసి మళ్లీ నీళ్లలోకి వదిలారు. వేల్ షార్క్‌లు చేపల వలల్లో చిక్కడం అత్యంత అరుదుగా జరుగుతుందని అధికారులు చెప్పారు. అయితే, తాజాగా మత్స్యకారుల వలలో చిక్కింది అంత భారీ వేల్ షార్క్ కాదు. అది సుమారుగా 20 నుంచి 25 అడుగుల పొడవు ఉందని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద చేప..
వేల్ షార్క్ అనేది ప్రపంచంలోనే అత్యంత భారీ చేప. బాగా ఎదిగిన వేల్ షార్క్ పరిమాణం దాదాపు 20 టన్నుల వరకు ఉంటుంది. అంటే 20 వేల కేజీలు. దాదాపు 60 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. ఇక వేల్ షార్క్ నోట్లో 300 వరుసల్లో పదునైన దంతాలు ఉంటాయి. దీని నోరు చాలా విశాలంగా ఉంటుంది. ఈ షార్క్ 80 ఏండ్ల నుంచి 130 ఏండ్ల వరకు జీవిస్తుంది. ఈ వేల్ షార్క్ చర్మం 10 నుంచి 15 సెంటీమీటర్ల మందం ఉంటుందని, చర్మం నలుపు లేదా ముదురు నీలం రంగులో ఉండి, దానిపై తెల్లని మచ్చలు ఉంటాయని అటవీశాఖ అధికారులు చెప్పారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

