శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టులోని ఏర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు సంభవించింది. దీంతో ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బాంబు డిస్పోజల్ బృందాలు కూడా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల కొంతమంది గాయపడినట్లు సమాచారం. అయితే ఎందుకు, ఎలా సంభవించాయనే విషయాలు తెలియాల్సి ఉన్నది.
#WATCH | Bomb Disposal Squad rushed to the explosion site in Jammu airport's technical area pic.twitter.com/K5XOy7hnDC
— ANI (@ANI) June 27, 2021