బిలాస్పూర్: దాయాది దేశాలపైన భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్‌లోని ముష్కర స్థావరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించింది. దీంతో పాకిస్థాన్‌పై భారత్‌పై నిర్విరామంగా కాల్పులకు తెగడుతుతున్నది. దేశంలోని ప్రధాన నగరాలు, ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తున్నది. ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్పూర్ (Bilaspur) అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ సరిహద్దుల్లో ఉండటంతో పాక్ దాడులు చేయవచ్చన్న ఉద్దేశంతో బ్లాక్ఔట్ (Blackout) ప్రకటించారు. ప్రజలు రాత్రివేళల్లో ఎట్టిపరిస్థితుల్లో లైట్లు వెలిగించకూడదని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. ఇంటా బయట విద్యుత్ దీపాలు ఆర్పివేసే ఉంచాలని స్పష్టం చేశారు. అదేవిధంగా సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని, అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోకూడదని పేర్కొన్నారు. ప్రజల భద్రత, రక్షణే తమకు ప్రధాన లక్ష్యం అని వెల్లడించారు.
వైమానిక దాడుల ముప్పును తప్పించుకునేందుకు ఆయా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో బ్లాక్ఔట్ ప్రకటిస్తున్నామని జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ కుమార్ వెల్లడించారు. రాత్రి వేళల్లో ఇన్డోర్, ఔట్‌డోర్‌లో అన్ని లైట్లు బంద్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, రాత్రి సమయంలో వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నామని చెప్పారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో భద్రతా బళగాల రవాణా సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉనా జిల్లాలో విద్యాసంస్థలను మూసివేశామని అధికారులు వెల్లడించారు.