సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో సమోసాల చుట్టూ రాజకీయం తిరుగుతున్నది. గత నెల ముఖ్యమంత్రి సుఖు పాల్గొన్న ఓ కార్యక్రమంలో సమోసాలు పోవడం, దానిపై సీఐడీ విచారణ జరుపుతుండటంతో వివాదం మొదలైంది. ‘సీఎం తినాల్సిన సమోసాలు పోయాయని సీఐడీ విచారణనా?’ అంటూ బీజేపీ ప్రశ్నిస్తున్నది. సీఐడీ విచారణపై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) శనివారం వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు సమోసాలు పంచిపెట్టింది. సీఎం ఇంటికి ఆన్లైన్లో 11 సమోసాలు ఆర్డర్ చేసి పంపింది.