అహ్మదాబాద్, డిసెంబర్ 8: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 182 సీట్లకు గానూ, 156 సీట్లు దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకొన్నది. కాంగ్రెస్ భారీ ఓటు బ్యాంకును కోల్పోయింది. కేవలం 17 సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇతరులు 4 స్థానాలు గెలుచుకొన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఆప్ భారీగా గండికొట్టింది.