చెన్నై: దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా పోరాడితేనే బీజేపీ నిరంకుశ పాలన అంతం అవుతుందని, దానికి సమాధి కట్టగలమని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తూ కోయంబత్తూరులో శనివారం నిర్వహించిన ర్యాలీలో స్టాలిన్ మాట్లాడారు. అవాస్తవాలపై నిర్మితమైన బీజేపీ పునాదులను విపక్షాల ఐక్యతే కూల్చుతుందని పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడు మంత్రి సెంథిల్‌బాలాజీని హవాలా కేసులో ఈడీ అరెస్టు చేసింది.
పీడీఏ ఫార్మూలాతోనే కమలం ఓటమి
రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే పీడీఏ (పిచ్డే, దళిత్, అల్పసంఖ్యాక్) ఫార్మూలాను అనుసరించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. పీడీఏ (బీసీలు, దళితులు, మైనారిటీలు) మాత్రమే బీజేపీని ఓడించగలదని వ్యాఖ్యానించారు. లక్నోలో నిర్వహించిన ఎన్డీటీవీ కాంక్లేవ్‌లో శనివారం మాట్లాడారు.