న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల అని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) విమర్శించారు. తమ పార్టీకి, కేజ్రీవాల్‌కు, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో భవిష్యత్తులో నితీశ్, ఆర్జేడీ, చంద్రబాబుకు అదే జరుగవచ్చని అన్నారు. ఢిల్లీలో పర్యటించిన ఆదిత్య ఠాక్రే, ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి రాహుల్ గాంధీని కలిసినట్లు తెలిపారు. గురువారం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అవుతున్నట్లు చెప్పారు.
కాగా, దేశ భవిష్యత్తు సందేహంలో ఉందని ఆదిత్య ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇవాళ దేశంలో ఓటర్ల మోసం, ఈవీఎం మోసాల మధ్య మన ఓటు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. నేడు మన దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతున్నాయా? మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని భావిస్తున్నాం, కానీ అది ఇకపై ప్రజాస్వామ్యం కాదు. మాకు (శివసేన), కేజ్రీవాల్, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో, భవిష్యత్తులో నితీశ్, ఆర్జేడీ, చంద్రబాబుకు జరుగవచ్చు. దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల’ అని అన్నారు.
ఇండియా బ్లాక్ భవిష్యత్తుపై ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఇండియా బ్లాక్‌లో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారని తెలిపారు. దాని కోసం వారు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తారని చెప్పారు. ‘ఇండియా బ్లాక్‌కు ఉమ్మడి నాయకత్వం ఉంది. ఒకే ఒక్క నాయకుడు లేడు. ఇది అహంకార పోరాటం లేదా ఒకరి ప్రయోజనం కోసం కాదు, దేశ భవిష్యత్తు కోసం పోరాటం’ అని అన్నారు.
మరోవైపు శివసేన విభజనకు కారణమైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సన్మానించడంపై వ్యాఖ్యానించేందుకు ఆదిత్య ఠాక్రే నిరాకరించారు. ‘నేను దాని గురించి మాట్లాడను. ఇలాంటి వ్యక్తిని (షిండే) మా వర్గం ఎప్పుడూ గౌరవించదు. ఆయన మా పార్టీని మాత్రమే కాకుండా మహారాష్ట్ర వెన్నును కూడా విరిచారు’ అని విమర్శించారు.
VIDEO | Delhi: Here’s what Shiv Sena (UBT) leader Aaditya Thackeray (@AUThackeray) said at a press conference in Delhi:
“Yesterday, we met Rahul Gandhi, and today we are meeting Arvind Kejriwal. The key reason behind these meetings is that the future of our country remains… pic.twitter.com/vdL8djpGkK
— Press Trust of India (@PTI_News) February 13, 2025