న్యూఢిల్లీ:యూపీలోని బారాబంకి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన ఉపేంద్ర సింగ్ రావత్‌కి అనుకోని కష్టం వచ్చిపడింది. పార్టీ ఇలా టికెట్ ప్రకటించిందో లేదో.. ఆ మరుసటి రోజే అతను వివాదంలో ఇరుక్కున్నారు. అతనికి సంబంధించిన ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై స్పందించిన రావత్.. తన నిర్దోషిత్వం నిరూపించుకునేంత వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రతిజ్ఞ చేశారు. ఆ వీడియోపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ వీడియో డీప్‌ఫేక్ అని కొట్టిపారేశారు. ఏఐ ఉపయోగించి నకిలీ వీడియో రూపొందించారని ఆరోపించారు.