
భువనేశ్వర్: ఒడిశాలో స్కూల్ టీచర్ మమితా మెహెర్ హత్యపై ఆ రాష్ట్ర బీజేపీ మహిళా వింగ్ భువనేశ్వర్లో శనివారం నిరసన చేపట్టింది. సీఎం నవీన్ పట్నాయక్ అధికార నివాసం వెలుపల ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రాష్ట్రంలో చట్టం చనిపోయిందని ఆరోపిస్తూ పాడెతో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు. ఉపాధ్యాయురాలి హత్య కేసులో ఆరోపణలున్న మంత్రి దివ్య శంకర్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అధికార బీజేడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ మహిళా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు, పోలీస్ మహిళా సిబ్బంది మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది.
మరోవైపు అధికార బీజేడీ ఈ ఆరోపణలను ఖండించింది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించింది. టీచర్ను హత్య చేసిన నిందితుడు గోవింద సాహు కస్టడీ నుంచి తప్పించుకోగా పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని, అతడి అనుచరుడ్ని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
#WATCH | Odisha BJP Women Wing protest outside Naveen Niwas Square, seeking resignation of Minister Dibya Shankar Mishra over alleged murder of school teacher. Several detained. pic.twitter.com/iw5Q1UUa3F
— ANI (@ANI) October 23, 2021