Vijay – Rahul Gandhi : తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్న జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఈసారి వివాదానికి తెరతీశారు. నిషేధిత ఎల్టీటీఈ సంస్థ మాజీ అధ్యక్షుడు వేలుపిల్లై ప్రభాకరన్ (Prabhakaran)కు ఆయన నివాళులు అర్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)ని బలిగొన్న సంస్థ అధిపతికి విజయ్ నివాళులు అర్పించడంపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. తన తండ్రిని దారుణంగా హత్య చేసిన సంస్థ పట్ల సీఎం విజయ్ సానుభూతితో వ్యవహరిచడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మౌనం దాల్చడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
శ్రీలంకలోని తమిళల హక్కుల కోసం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సంస్థను స్థాంపిచిన వేలుపిల్లై ప్రభాకరన్ 2009లో మే 18న ముల్లివైక్కల్ ప్రాంతంలో శ్రీలంక సైన్యం కాల్పుల్లో మరణించారు. ఆయన వర్ధంతి సందర్భంగా సీఎం విజయం సోమవారం ఎక్స్‌లో నివాళులు అర్పిస్తూ .. ‘ముల్లివైక్కల్ జ్ఞాపకాలను మా హృదయాల్లో దాచుకుంటాం. సముద్ర పరివాహ ప్రాంతంలో నివసిస్తున్న తమిళ ప్రజల హక్కులకు మద్దతుగా మేము ఎల్లప్పుడూ నిలబడుతాం’ అని పోస్ట్ పెట్టారు.
முள்ளிவாய்க்கால் நினைவுகளை இதயத்தில் ஏந்துவோம்! கடல் கடந்து வாழும் நம் தமிழ்ச் சொந்தங்களின் உரிமைகளுக்காக எப்போதும் துணை நிற்போம்!
— TVK Vijay (@TVKVijayHQ) May 18, 2026
ప్రభాకరన్‌ను ఉద్దేశించే విజయ్ ఆ పోస్ట్ పెట్టారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాజీవ్ గాంధీ హత్యలో కీలకమైన ప్రభాకరన్‌కు ముఖ్యమంత్రి నివాళులు అర్పించడాన్ని తీవ్రంగా పరిగణించారు బీజేపీ చీఫ్ అమిత్ మాలవియా. విజయ్ పోస్ట్‌పై ఆయన రాహుల్ గాంధీ మౌనాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుడైన ప్రభాకరన్‌కు విజయ్ నివాళులు అర్పించారు. అయినా రాహుల్ గాంధీకి ఏ సమస్య లేదు. ప్రభుత్వంలో భాగం అయినంతసేపు ఆ పార్టీకి ఇవేవీ పట్టవు. డీఎంకే కూడా ఎల్టీటీఈని క్షమించే పార్టీయే. అయినా కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో కూటమిని కొనసాగించింది.
Tamil Nadu’s new Chief Minister has paid homage to LTTE chief Velupillai Prabhakaran, whose outfit assassinated former Prime Minister Rajiv Gandhi.
Of course, Rahul Gandhi would have no problem with it, as long as the Congress gets a slice of power. After all, the DMK too was an… pic.twitter.com/1HRaI1xmzm
— Amit Malviya (@amitmalviya) May 19, 2026
కాంగ్రెస్ తన రాజకీయ విలువల విషయంలో చాలా సౌకర్యంగా ఉంది. కానీ, హిందువులు డీఎంకేను నమ్ముతున్నారు. అయితే.. ఆ పార్టీ టీవీకేను విమర్శించడం మొదలెట్టింది. సీఎం విజయ్ గెలుపులో సోషల్ మీడియా ప్రభావం ఉందని అంటోంది. హిందువుల నుంచి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పరంగా ఒకటి లేదారెండు విషయాలను కచ్చితంగా నేర్చుకుంటుంది అని అమిత్ మాలవియా ఎక్స్ పోస్ట్ పెట్టారు. తమ పార్టీ అధినేత విజయ్‌పై వస్తున్న విమర్శలను టీవీకే నేతలు కొట్టిపారేస్తున్నారు. శ్రీలంకలో ఊచకోతకు గురైన వేలాదిమంది తమిళ ప్రజలను ఉద్దేశించి విజయ్ పోస్ట్ పెట్టారని.. అంతేతప్ప ప్రభాకరన్ మరణానికి విచారిస్తూ ఆయన నివాళులు అర్పించలేదని పేర్కొన్నారు.