Haryana local polls : హర్యానాలోని పది మున్సిపల్ కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 10 పురపాలికల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క మేయర్ సీటు కూడా దక్కలేదు. హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ఇలాకా అయిన గురుగ్రామ్, రోహ్తక్లలో కూడా కాంగ్రెస్‌కు ఘోర పరాభవాన్నే చవిచూసింది. అధికార బీజేపీ మొత్తం పదింట 9 మేయర్ పదవులు దక్కించుకుంది.
మరో మేయర్ పోస్టు బీజేపీ రెబెల్, స్వతంత్య్ర అభ్యర్థి ఇందర్జిత్ యాదవ్‌కు దక్కింది. మానేసర్ మేయర్ పదవికి ఆయన ఎంపికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఓటమినే చవిచూసింది. గురుగ్రామ్‌లో బీజేపీ నాయకుడు రాజ్‌రాణి మేయర్‌గా విజయం సాధించారు. గెలుపు అనంతరం ఆమె విజయోత్సవ ర్యాలీని కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Haryana Municipal Corporation Election | BJP leader Raj Rani Malhotra wins mayor elections from Gurugram, holds roadshow in the area pic.twitter.com/3R1b5duptu
— ANI (@ANI) March 12, 2025