BJP : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress top leader), లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (New CJI) ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవడం సిగ్గుచేటని బీజేపీ (BJP) మండిపడింది. ముఖ్యమైన కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించింది.
సీజేఐ ప్రమాణస్వీకారానికి ప్రభుత్వం నుంచి అందరు ప్రముఖులు హాజరయ్యారని, కానీ ప్రతిపక్ష నుంచి రాహుల్‌గాంధీగానీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేగానీ రాకపోవడం సిగ్గుచేటని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇంతటి కీలకమైన కార్యక్రమానికి డుమ్మాకొట్టడం ద్వారా ప్రజాస్వామ్య సంప్రదాయాలను మళ్లీమళ్లీ అగౌరవపరిచే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారని ఎద్దేవా చేశారు.
రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, సీజేఐ ప్రమాణస్వీకారానికి ఎందుకు డుమ్మా కొట్టారో అనే సంగతి ఎవ్వరికీ తెలియదని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాళవీయ విమర్శించారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అంతర్గత కలహాలు విపరీతమవుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానం ఏమీ చేయలేకపోతోందని ఆరోపించారు.