Water Crisis : దేశ రాజధానిలో జల సంక్షోభంపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి చుక్క కోసం ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు నీటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నీటి చౌర్యం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకుంటే ఢిల్లీ ప్రజలకు నీటి కష్టాలు తీరతాయని అన్నారు.
నగర ప్రజలకు నీటి సరఫరా మెరుగుపరచాలనేదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ఇక ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతూ బీజేపీ శ్రేణులు ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం ఎదుట బుధవారం నిరసనలు చేపట్టారు.
Read More :
STSS | జపాన్ను వణికిస్తున్న మరో మహమ్మారి.. 48 గంటల్లో మనిషిని చంపేస్తుందట..!