Nagrota : జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని నగ్రోటా (Nagrota) అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి (BJP candidate) దేవయాని రాణా (Devayani Rana) ఘన విజయం సాధించారు. ఈ పోటీలో అధికార పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం.
నగ్రోటా నియోజకవర్గంలో రాణా కుటుంబానికి ఉన్నపట్టు మరోసారి నిరూపితమైంది. ఈ విజయంపై దేవయాని రాణా స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేశారు. నగ్రోటా ప్రజలు తనను ఒక కుటుంబసభ్యురాలిగా భావించి ఆశీర్వదించారని పేర్కొన్నారు. మా తండ్రి రాణా సాహిబ్పై చూపిన ప్రేమాభిమానాలనే నాపై కూడా చూపించారని ఆమె అన్నారు.