భోపాల్, నవంబర్ 11: ఉచితాలు వద్దని, వాటికి తాము వ్యతిరేకమని చెప్పే బీజేపీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అవే ఉచితాలతో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని పలు అంశాలను కాపీ కొట్టిన కమలం పార్టీ మధ్యప్రదేశ్లో శనివారం ‘సంకల్ప్ పత్’్ర పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
రాష్ట్రంలోతమకు మళ్లీ అధికారం ఇస్తే లాడ్లీ బహనా యోజన, పీఎం ఉజ్వల లబ్ధిదారులకు రూ.450కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని పేర్కొన్నది. పేద కుటుంబాల బాలికలకు మాత్రమే పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించింది. కాగా, తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అర్హులైన పేద కుటుంబాలకు రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించింది.