న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ నిరసన చేపట్టింది. (BJP protest) ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కైలాష్ గహ్లాట్ ఈ నిరసనకు నేతృత్వం వహించారు. సీఎం అధికార నివాసం ఆధునీకరణకు రూ.45 కోట్లు ఖర్చు చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. గురువారం ఉదయం ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో అరవింద్ కేజ్రీవాల్ నివసిస్తున్న బంగ్లా వద్దకు బీజేపీ నేతలు, వందలాది కార్యకర్తలు చేరుకున్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ సీఎంగా ఆయన ఉన్నప్పుడు అధికార నివాసం ‘షీష్ మహల్’ పునరుద్ధరణకు రూ.45 కోట్ల నిధులు కేటాయించడాన్ని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
కాగా, ఈ నిరసనకు నేతృత్వం వహించిన కైలాష్ గహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ‘షీష్ మహల్’ అంశంపై నిరసన తెలిపేందుకు తాము ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఈ వివాదం నిజంగా దురదృష్టకరమని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు తాను పంపిన రాజీనామా లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు వివరించారు. ఆప్ ప్రధాన సూత్రాలకు ఇది విరుద్ధమని విమర్శించారు.
#WATCH | Delhi BJP leaders and workers protest near the residence of AAP national convener Arvind Kejriwal, over ‘Sheesh Mahal’ controversy. pic.twitter.com/HS6Zxp30jw
— ANI (@ANI) November 21, 2024
#WATCH | BJP leader Kailash Gahlot says, “We have come here to protest over the ‘Sheesh Mahal’ issue. When I wrote a letter to Arvind Kejriwal, I wrote clearly that a controversy has been created over Sheesh Mahal is truly unfortunate. This is an example of compromise with the… https://t.co/AN4l5xXME6 pic.twitter.com/7g3kMsur5A
— ANI (@ANI) November 21, 2024