బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉండటంతో నేను వెంటనే కరోనా టెస్ట్ చేయించుకున్నా. రిపోర్ట్‌లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. డాక్టర్ల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేట్ అయ్యా. గత కొన్ని రోజుల నుంచి నన్ను కలిసిన వాళ్లు వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండి.. అంటూ జేపీ నడ్డా హిందీలో ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
शुरुआती लक्षण दिखने पर मैंने अपना कोविड टेस्ट करवाया।मेरी रिपोर्ट पॉज़िटिव आई है।अभी मैं स्वस्थ महसूस कर रहा हूँ। डॉक्टर्स की सलाह पर मैंने खुद को आइसोलेट कर लिया है।
— Jagat Prakash Nadda (@JPNadda) January 10, 2022
पिछले कुछ दिनों में जो लोग भी मेरे संपर्क में आए हैं, उनसे अनुरोध है कि अपनी जाँच करवा लें।