BJP Dynastic Politics | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వారసత్వ రాజకీయాలకు బీజేపీ మారుపేరుగా మారింది. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని సుద్దులు చెప్పే ముందు ప్రధాని మోదీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సొంత పార్టీలోని కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ నేతలు, రాష్ట్ర నేతల వరకు వారి వంశవృక్షాలు కనిపించేవి. నిన్నటికి నిన్న కేరళకు చెందిన కాంగ్రెస్ నేత ఏకే అంటోని కుమారుడు అనిల్ అంటోనీకి కాషాయ కండువా కప్పినప్పుడు వారసత్వ రాజకీయాలు గుర్తుకు రాలేదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ రాజకీయాలు అనేది ప్రత్యర్థి పార్టీలోనే మోదీకి కనిపిస్తాయా? మరి బీజేపీ సంగతేంటని నిలదీస్తున్నారు.
పేరు: అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి
వారసత్వం: హిమాచల్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు.
పేరు: పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి
వారసత్వం: బీజేపీ మాజీ జాతీయ కోశాధికారి, మాజీ కేంద్రమంత్రి వేద్ ప్రకాశ్ గోయల్ కుమారుడు.
పేరు: రాజ్వీర్ సింగ్, లోక్‌సభ ఎంపీ
వారసత్వం: యూపీ మాజీ సీఎం, రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్ కుమారుడు
పేరు: జ్యోతిరాదిత్య సింధియా, పౌర విమానయాన శాఖ మంత్రి
వారసత్వం: విజయరాజే సింధియా మనుమడు. మాధవరావు సింధియా కుమారుడు.
పేరు: కిరణ్ రిజిజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి
వారసత్వం: అరుణాచల్ తొలి ప్రొటెం స్పీకర్ రిన్చిన్ ఖరూ కుమారుడు
పేరు: సువేందు అధికారి, బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు
వారసత్వం: లోక్‌సభ ఎంపీ, బీజేపీ నేత శిశిర్ అధికారి కుమారుడు.
పేరు: దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
వారసత్వం: మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత గంగాధర్‌పంత్ ఫడ్నవీస్ కుమారుడు.
పేరు: వరుణ్ గాంధీ, లోక్‌సభ ఎంపీ
వారసత్వం: బీజేపీ ఎంపీ మేనకా కొడుకు
పేరు: పంకజ్ సింగ్, నోయిడా ఎమ్మెల్యే
వారసత్వం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు.
పేరు: దుశ్యంత్ సింగ్, లోక్‌సభ ఎంపీ
వారసత్వం: రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే కుమారుడు.
పేరు: సన్నీ డియోల్, లోక్‌సభ ఎంపీ
వారసత్వం: బీజేపీ మాజీ ఎంపీ ధర్మేంద్ర కుమారుడు.
పేరు: దియా కుమారి, లోక్‌సభ ఎంపీ
వారసత్వం: మాజీ ఎంపీ మహారాణి గాయత్రి దేవీ మనుమరాలు
పేరు: జయంత్ సిన్హా , లోక్‌సభ ఎంపీ
వారసత్వం: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు.
పేరు: పర్వేశ్ వర్మ, లోక్‌సభ ఎంపీ
వారసత్వం: ఢిల్లీ మాజీ సీఎం, బీజేపీ నేత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
పేరు: పూనం మహాజన్, లోక్‌సభ ఎంపీ
వారసత్వం: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె.
పేరు: రిటా బహుగుణ జోషి, ఎంపీ
వారసత్వం: యూపీ మాజీ సీఎం, బీజేపీ నేత హేమవతీ నందన్ బహుగుణ.
పేరు: సంగీత సింగ్ డియో, ఎంపీ
వారసత్వం: ఒడిశా మాజీ మంత్రి, బీజేపీ నేత కనక్ వర్ధన్ సింగ్ డియో సతీమణి.
పేరు: ప్రీతమ్ ముండే , లోక్‌సభ ఎంపీ
వారసత్వం: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె.
పేరు: పెమా ఖండు, అరుణాచల్ సీఎం
వారసత్వం: అరుణాచల్ మాజీ సీఎం దూర్జే ఖండు కుమారుడు.
పేరు: వివేక్ ఠాకూర్, రాజ్యసభ ఎంపీ
వారసత్వం: కేంద్ర మాజీ మంత్రి సీపీ ఠాకూర్ కుమారుడు
పేరు: నీరజ్ శేఖర్, రాజ్యసభ ఎంపీ
వారసత్వం: మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు
పేరు: హీనా గవిట్, లోక్‌సభ ఎంపీ
వారసత్వం: బీజేపీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ గవిట్ కుమార్తె
పేరు: ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి
వారసత్వం: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత దేబేంద్ర ప్రధాన్ కుమారుడు.
పేరు: అశుతోష్ టాండన్, ఎమ్మెల్యే
వారసత్వం: బీహార్, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ లాల్జీ టాండన్ కుమారుడు.
పేరు: సురేంద్ర పట్వా, ఎమ్మెల్యే
వారసత్వం: మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్‌లాల్ పట్వా మేనల్లుడు
పేరు: బీవై రాఘవేంద్ర, లోక్‌సభ ఎంపీ
వారసత్వం: కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడు.