లక్నో: బీజేపీవి విభజన రాజకీయాలని ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఆరోపించారు. తమ ఓట్లను మళ్లించేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల అనంతరం ఆర్ఎల్డీతో పొత్తుపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. బీజేపీ ఉచ్చులో ఎవరూ పడరని అన్నారు. కేవలం జాట్ కమ్యూనిటీ మాత్రమే కాదని, 36 సంఘాల మద్దతు కూడా అవసరమని తెలిపారు. అందరి మద్దతు లభించినప్పుడే ఎన్నికల్లో విజయం సాధించగలుగుతామన్నారు.
కాగా, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్‌కు తలుపులు తెరిచే ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఇటీవల బహిరంగ ప్రకటనలు చేశారు. ఎన్నికల అనంతరం తమ పార్టీల మధ్య పొత్తు ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే బీజేపీ చేస్తున్న ఈ వాదనలను ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఖండించారు. జాట్ల ఓట్లను మళ్లించేందుకు ఇలా కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు.