న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఒక్కో అభ్యర్థికి రూ.15 కోట్లు ఇస్తామంటూ తమ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఓట్ల లెక్కింపు మొదలుకాకముందే తన ఓటమిని బీజేపీ ఒప్పుకున్నట్టు అయ్యిందని ఆయన విమర్శించారు. ఇతర రాష్ర్టాల్లో చేసినట్టుగా ఢిల్లీలోనూ పార్టీలను చీల్చే పని బీజేపీ చేపట్టిందని అన్నారు. ఏడుగురు ఆప్ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్‌కాల్స్ వెళ్లాయని చెప్పారు.