ఘజియాబాద్: యూపీలో ప్రతిరోజూ 50 వేల గోవులను వధిస్తున్నారని, అయినా తమ ప్రభుత్వం మౌనంగా ఉంటున్నదని లోని నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుజర్ సంచలన ఆరోపణలు చేశారు. గోవుల సంక్షేమం కోసం కేటాయిస్తున్న డబ్బులను అధికారులు తింటున్నారని ఆయన అన్నారు.
ఇలాంటి వారికి అధినేతగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారని ఆరోపించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 375 స్థానాలు గెలుస్తుందని, లేకపోతే చాలామంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని హెచ్చరించారు.