న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(BJP MP Tejasvi Surya).. ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్‌మ్యాన్ 70.3 ఛాలెంజ్‌లో ట్రయథ్లాన్ ఉంటుంది. గోవాలో ఈ కాంపిటీషన్ జరిగింది. దీంట్లో 1.9 కిలోమీటర్ల ఈత, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్ల పరుగు ఉంటుంది. ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న వాళ్లు మొత్తం 113 కిలోమీటర్లు అంటే 70.3 మైళ్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ట్రయథ్లాన్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి పార్లమెంటేరియన్‌గా తేజస్వి సూర్య రికార్డు సృష్టించారు.
ఎంపీ తేజస్వి ఫీట్ పట్ల ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్ చేపట్టేందుకు ఫిట్ ఇండియా ఉద్యమమే ప్రేరణగా నిలిచిందన్నారు. ఎంపీ తేజస్వి అద్భుతమైన ఫీట్‌ను అందుకున్నట్లు ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. తేజస్వి అనేక మంది యువతకు ఫిట్‌నెస్‌లో ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఫిట్నెస్ కోసం గత నాలుగు నెలల నుంచి తీవ్రంగా శిక్షణ తీసుకున్నట్లు ఎంపీ సూర్య తెలిపారు.
Commendable feat!
I am sure this will inspire many more youngsters to pursue fitness related activities. https://t.co/zDTC0RtHL7
— Narendra Modi (@narendramodi) October 27, 2024