బిల్వారా: రాజస్థాన్‌లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు(Rajasthan Elections) జరుగుతున్నాయి. 199 సీట్ల కోసం పోలింగ్ సాగుతోంది. ఇక బిల్వారాలో బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన భార్యతో కలిసి టూవీలర్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లారు. యాక్టివా వాహనంపై ఆయన సాదాసీదాగా పోలింగ్ బూత్‌కు వెళ్లారు. రాజస్థాన్‌లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కరణ్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ మృతిచెందడం వల్ల ఆ స్థానానికి ఎన్నికల్ని సస్పెండ్ చేశారు.
#WATCH | Rajasthan Elections | BJP MP Subhash Chandra Baheria and his wife Ranjana Baheria arrived at a polling booth in Bhilwara on a two-wheeler to cast their votes. pic.twitter.com/9Qj793x6vl
— ANI (@ANI) November 25, 2023
రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ఇవాళ జలావర్‌లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వాడుకోవాలని ఆమె కోరారు. తొలిసారి ఓటర్లు తప్పకుండా ఓటును వినియోగించుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్.. జైపూర్‌లో తన ఓటు వేశారు. ఓటు వేయడానికి ముందు ఆయన బాలాజీ ఆలయంలో పూజలు చేశారు. జోద్‌పూర్‌లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.