బెంగళూర్ : కర్నాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూర్-ఊటీ రోడ్డులో మసీదు తరహాలో ఉన్న బస్టాండ్‌ను కూల్చివేస్తానని కాషాయ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాను ఈ బస్టాండ్‌ను సోషల్ మీడియాలో చూశానని, బస్టాండ్‌కు రెండు డోములున్నాయని, మధ్యలో పెద్ద డోము ఉండగా దాని పక్కన చిన్న డోమ్ మరొకటి ఉందని ఎంపీ పేర్కొన్నారు.
అది బస్టాండ్ కాదు మసీదేనని పేర్కొన్నారు. మూడు నాలుగు రోజుల్లో ఈ కట్టడాన్ని కూల్చివేయాలని తాను ఇంజనీర్లకు సూచించానని ఆయన చెప్పుకొచ్చారు. వారు దీన్ని కూల్చేయకపోతే తానే జేసీబీతో వెళ్లి కట్టడాన్ని కూలగొడతానని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. మైసూర్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అసంబంధమైనవని కర్నాటక కాంగ్రెస్ నేత సలీం అహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.