ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీ గురించి బీజేపీ ఎంపీ కే.జే. ఆల్ఫోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో దేశంలోని నిరుద్యోగిత గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా ఎంపీ కే.జే. ఆల్ఫోస్ మాట్లాడుతూ.. అంబానీ, అదానీకి పూజ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వారిద్దరూ ఉద్యోగాలను సృష్టిస్తున్నారని, అందుకే వారికి పూజలు చేయాలని అన్నారు. ‘నేను పెట్టుబడిదారుల పక్షాన్ని తీసుకుంటానని మీరు విమర్శలు చేయవచ్చు. వారు ఈ దేశంలో ఉపాధిని సృష్టిస్తున్నారు. ఉద్యోగాలు కల్పిస్తున్నారు. వారి పేర్లను కూడా నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే మీరూ ప్రస్తావించారు కాబట్టి. రిలయన్స్ గానీ, అంబానీ గానీ, అదానీ గానీ.. మరెవ్వరైనా కానీయండి.. వారందరినీ పూజించాలి. ఎందుకంటే.. ఉపాధిని కల్పిస్తున్నారు. అందుకే వారిని కచ్చితంగా పూజించాల్సిందే’ అంటూ బీజేపీ ఎంపీ కే.జె. ఆల్ఫోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.