చండీగఢ్, మే 18: కేంద్ర మాజీ మంత్రి, అంబాలా బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా(71) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. న్యుమోనియా చికిత్స కోసం చండీగఢ్‌లోని ప్రభుత్వ దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం అధికార లాంఛనాలతో మణిమజ్రలో అంత్యక్రియలు నిర్వహించారు. హర్యానా సీఎం ఖట్టర్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు హాజరై నివాళి అర్పించారు.
కటారియా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కటారియా కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రిగా, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ శాఖ మంత్రిగా మే 2019 నుంచి జూలై 2021 వరకు పనిచేశారు. అంబాల నియోజకవర్గం నుంచి ఎంపీగా 1999, 2014, 2019లలో ఎన్నికయ్యారు. బీజేపీలో దళిత నేతగా పేరొందిన కటారియా హర్యానాలో పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.