బెంగళూరు: పార్లమెంట్లో ఇటీవల అలజడికి సృష్టించిన ఇద్దరు వ్యక్తులకు విజిటర్ పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తొలిసారి ఆ విషయమై స్పందించారు. ఓ సంఘం ప్రచురించిన ఓ పోస్టర్లో తాను చేతిలో బాంబుతో ఉన్నట్టు చూపిస్తూ దేశ ద్రోహి అని రాయడంపై ఆయన స్పందించారు. ‘నా గురించి ప్రజలకు తెలుసు. 2024 లోక్ సభ ఎన్నికల్లో వారే తీర్పు చెబుతారు. చాముండేశ్వరి మాత, కావేరీ మాత, 20 ఏళ్ల నుంచి నా వ్యాసాలను చదువుతున్నవారు, 20 ఏళ్ల నుంచి నా కృషిని చూస్తున్న మైసూరు, కొడగు ప్రజలు నేను దేశ ద్రోహినా? దేశ ప్రేమికుడినా? అనే విషయంపై తీర్పు చెబుతారు. 2024లో లోక్సభ ఎన్నికల్లో వారు తీర్పు చెబుతారు.నేను దేశ ద్రోహినా? దేశ భక్తుడినా? అనే విషయంపై తీర్పు చెప్పవలసినది వారే” అని ప్రతాప్ సింహా అన్నారు.