శివమొగ్గ, డిసెంబర్ 26: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమను తాము రక్షించుకొనే హక్కు ప్రతిఒక్కరికీ ఉన్నదని పేర్కొంటూ ‘ఇంట్లో ఉండే కత్తులకు పదును పెట్టి సిద్ధంగా ఉండండి’ అంటూ హిందువులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని శివమొగ్గలో హిందూ జాగరణ వేదిక సదస్సులో సోమవారం పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తమపై, తమ ఆత్మగౌరవంపై దాడులు చేసేవారిపై తగిన విధంగా స్పందించే హక్కు హిందువులకు ఉన్నదని అన్నారు. లవ్జీహాద్లో పాల్గొనేవారికి తగిన విధంగా సమాధానం ఇవ్వాలంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఇదే సమయంలో పిల్లలను మిషనరీ విద్యాసంస్థలకు పంపొద్దని తల్లిదండ్రులకు సూచించారు.