అలీగఢ్: ఒక ప్రభుత్వ కార్యక్రమంలో తోటి మహిళా ఎమ్మెల్యే భుజంపై చేతులేసి అనుచితంగా ప్రవర్తించాడో బీజేపీ ఎంపీ. యూపీ లో అలీగఢ్‌లోని కోల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ పక్కనే ఉన్న మహిళా ఎమ్మెల్యే భుజాలపై చేతులు వేసారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ఆమె తన సీటును స్టేజిపై మరోచోటుకు మార్చుకున్నారు. ఈ దృశ్యం వీడియోలో రికార్డు కావడం, అది వైరల్ అవ్వడంతో బీజేపీ ఎంపీ చర్యను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు.