జోధ్‌పూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నేతల మధ్య కుమ్ములాటలు పతాకస్థాయికి చేరుకున్నాయి. సంచోర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడానికి వెళ్తున్న బీజేపీ ఎంపీ దేవ్‌జీ పటేల్ కాన్వాయ్‌పై కొంతమంది రాళ్లదాడికి పాల్పడ్డారు.
వీరంతా మరో బీజేపీ ఎంపీ దానరామ్ చౌదరీ అనుచరులని వార్తలు వెలువడ్డాయి. పార్టీ టికెట్ దేవ్‌జీ పటేల్‌కు కేటాయించటాన్ని చౌదరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.