Microsoft Cloud Outage : మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయంతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్ సహా పలు రంగాల సేవలు నిలిచిపోయాయి. మ్యాన్యువల్ బ్యాకప్ సిస్టమ్‌తో పరిస్ధితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని పౌరివిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రయాణీకులు సంయమనంతో, ఓపికతో సహకరిస్తున్నారని ప్రశంసించారు. ఇక ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ, కమర్షియల్ పైలట్ రాజీవ్ ప్రతాప్ రూడీ స్పందించారు.
మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్ అని ఇది కుప్పకూలడం లేదా షట్‌డౌన్ అయిఉంటుందని పేర్కొన్నారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అవుటేజ్తో టికెటింగ్, లాజిస్టిక్స్, బుకింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇతర లాజిస్టిక్స్ సేవలు వంటి బ్యాకెండ్ సర్వీసులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇది విమాన ప్రయాణీకుల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపబోదని రాజీవ్ ప్రతాప్ రూడీ స్పష్టం చేశారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు కంప్యూటర్లలో విండోస్-11, విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడిచే కంప్యూటర్లు, లాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడంతో పలు సేవలు నిలిచిపోయాయి. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాతో పలు దేశాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ ఎర్రర్ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, స్టోరేజీ మీడియా సేవలకు అంతరాయం కలుగుతున్నది. ఈ క్రమంలో భారత్‌లో విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్ సేవలు స్తంభించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిచిపోయింది.
Read More :
Prabhas Fauji | ‘స్పిరిట్’ ఆలస్యం.. అక్టోబర్‌లో సెట్స్‌పైకి ప్రభాస్ ‘ఫౌజీ’?