Mohan Charan Majhi : ఒడిషా నూతన సీఎంగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీద డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చీఫ్ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఘోర పరాజయం పాలైన అనంతరం మోహన్ మాఝీ తొలి బీజేపీ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు.
నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభా పక్ష నేతగా మోహన్ మాఝీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్ పరిశీలకులుగా హాజరయ్యారు.
కాగా, 2000, 2004లో బీజేడీతో కలిసి సంకీర్ణ సర్కార్లో బీజేపీ భాగస్వామిగా ఉంది. అయితే ఒడిషాలో తొలిసారిగా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ మాఝీ కెంజహార్ స్ధానం నుంచి బీజేడీ అభ్యర్ధి మినా మాఝీపై విజయం సాధించారు. ఇక మాఝీ ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం భువనేశ్వర్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు హాజరు కానున్నారు.
Read More :
Shatrughan Sinha | సోనాక్షి సిన్హా వివాహంపై మౌనం వీడిన శత్రుఘ్న సిన్హా